Thursday 19 January 2017

ది రోడ్ (2009)  





Son: Do we eat humans, when we starve?
Father: We are already starving.
Son: We shouldn’t eat humans, even though we die with starvation.
Father: No, we don’t, my son.

మృత్యు శీతలత.
అగాధమైన ఒంటరితనం.
ఎడతెగని భయం.
……………………
ఒక విలయం తరువాత…

వర్ణాలుధ్వనులునామాలుసూర్యరశ్మివెచ్చదనంసంతోషంఆశ…అన్నీ తుడిచిపెట్టుకుపోయిన భూమిపై ఒక తండ్రి(45), ఒక కొడుకు (9) మెల్లగావిచారభరితంగా పయనిస్తున్నారు. తీరప్రాంతానికి వెళ్లాలని వారి ప్రయత్నం. అక్కడ పరిస్థితులు కాస్తంత మెరుగుగా ఉంటాయని ఆశ. కాని అక్కడ ఏముందో ఎవరికి తెలుసునిజంగా వారక్కడికి చేరగలరా?
ప్రతి దినం మునుపటి రోజుకంటే నల్లనిది. ప్రపంచం మెల్లగా మరణిస్తోంది. ప్రాణులన్నీనశించాయి. పంటలు పండే అవకాశం ఇక లేదు. నేలంతా బూడిదమయం అయింది. వృక్షాలన్నీ కూలిపోయాయి. రోడ్లు సాయుధులైన మూకలతో నిండిపోయాయి. ఇంధనంఆహారం కోసం వేట.  శిఖరాల మీద మంటలు ఎగసాయి. కానిబాలిజం (cannibalism) విస్తరించింది. కానిబాలిజం… అది వెన్నులో వణుకుపుట్టిస్తుంది. నేను ఆహారం కోసం ఆందోళన పడుతున్నాను. అవునుఎక్కువగా ఆహారం కోసమేఇంకా ఈ చలి గురించిమా బూట్ల గురించి…” తండ్రి తనలో తాను మధనపడ్డాడు.
అంతులేకుండా బూడిద ఆకాశంలో ఎగసిపడుతోంది. నగరాలు శిథిలమై నిర్మానుష్యంగా మిగిలాయి. ఎక్కడా ఆహారం లేదు. మొక్కలు పెరుగుతాయనే ఆశాలేదు. కొద్దిమంది మనుషులు మాత్రమే భూమిపై మిగిలిఉన్న చివరి జీవులు. కాని వారిప్పుడు ఎంతమాత్రం మనుషులు కారు. ఎందుకంటే వారి primitive instincts పూర్తిగా బయటపడే సమయమిది.  మనుషుల యదార్థ స్వభావాలు వెల్లడి అయ్యే సమయమిది. మనుషుల ముసుగులు తొలగే అత్యంత సంక్లిష్ట సమయమిది. మనుషులు తోడేళ్ళుగా మారే వేళ ఇది.

ఆ తండ్రి దగ్గర ఒక రివాల్వర్రెండు బుల్లెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి కొడుకుని రక్షించేందుకు వినియోగించేసాడు. మిగిలిన ఒక బులెట్ ని అత్యంత ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడుకొడుకుకి తనని తాను అంతం చేసుకోమని ఇచ్చాడు. కొడుకుని బాధాకరమైన మరణం నుండి ఆ బులెట్ రక్షిస్తుందని అతని ఆశ. వారి ప్రయాణంలో సంభవించిన సంఘటనలుఆ ఘటనలకు వారు స్పందించిన తీరు మన హృదయాలలో లోతైన తాత్వికతను ఆవిష్కరిస్తుంది. భయం ఒక్కొక్కసారి మానవత్వాన్ని అణచివేస్తుంది. మరొకసారి మానవత్వం భయాన్ని జయిస్తుంది.
ది రోడ్” చిత్రాన్నిచూసినప్పుడు భయం యొక్క విస్తృతిలోతు మనకి అనుభూతమవుతాయి. మానవ స్వభావంలోని వైరుధ్యాలు మనలో వణుకు పుట్టిస్తాయి. భయకరమైన నైరాశ్యం. గూడు కట్టిన భయం. అరుదైనవిలక్షణమైన తాత్వికత జీవితం యొక్క నిష్ఫలతనుఅదే సమయంలో జీవన సౌందర్యాన్ని ఏకకాలంలో హృదయంలో ఆవిష్కరిస్తుంది. మానవ స్వభావంలోని ఔన్నత్యంమృగత్వం రెండూ వ్యక్తమవుతాయి. ఒక గంభీరమైన అనుభవం మన చేతనను ఆసాంతం ఆక్రమించుకుంటుంది. రోజుల తరబడి గాఢమైన విషాదంఅనూహ్యమైన వేదన మన హృదయాలను వెంటాడుతాయి.
మహా కళాకారుడైన ఆస్ట్రేలియన్ దర్శకుడు జాన్ హిల్కోట్ తన చిత్రాలలో అత్యంత లోతైన తాత్వికతను ఆవిష్కరిస్తాడు. ఆయన ప్రతి చిత్రం ఒక అలౌకిక అనుభవం. మహా నటుడు విగ్గో మార్టెన్ సెన్ తండ్రి పాత్రలో పలికించిన భావాలు మన హృదయాన్ని దిగులుతో నింపేస్తాయి. అతని దిగులుస్వార్థంత్యాగంకొడుకు యొక్క మానవీయమైన ఆధిక్యతకి అతని అతడు చిన్నబోవడంఇలా ప్రతి భావం ఆయన వదనంలో పలికించిన తీరు అసాధారణం. నిక్ కేవ్వారెన్ ఎల్లెస్ ల అత్యంత సున్నితమైన సంగీతం హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోతుంది. వివరించలేని తాత్వికతని హృదయంలో ఆవిష్కరిస్తుంది.
ఈ చిత్రం జీవితాంతం వెంటాడే ఒక నాణ్యమైన కవితాత్మక అనుభవాన్ని ఇస్తుంది. మానవ జీవితం పై ఒక కాంతిని ప్రసరిస్తుంది.


Film: The Road (2009)
Country : USA
Language:  English
Run time : 111 min
Director: John Hillcoat
Actors : Viggo Mortensen , Kodi Smit-McPhee, charlize theron, Robert Duvall  Robert Duvall
Music : nick cave and warren ellis
___

No comments:

Post a Comment