Friday 20 January 2017

సూఫీయిజం 

రబియా క్రీ.శ. 717–801 సం.ల మధ్య కాలంలో జీవించిన సూఫీ మార్మికురాలు. నేను Sufism పట్ల ఆకర్షితంకావడానికి ఆమె కవిత్వంమే కారణం.


నేను Sufism పేరు కూడా వినని రోజులవి. చాలా ఏళ్ళ క్రితం భీమిలిలో చిక్కాల కృష్ణారావు గారి ఇంటికి ఒక ఆదివారం గడిపేందుకు వెళ్లాను. ఇంకా ఇతర అతిధులు కూడా వచ్చారు. ఆయన చలం గారితో కలిసి అరుణాచలంలో జీవించిన రోజులలో జరిగిన సరదా సంఘటనల గురించి ఉల్లాసంగా చెప్పుకుంటూ పోతున్నారు. అప్రయత్నంగా అక్కడ ఉన్న ఒక పత్రిక తెరిచాను. అందులో నాలుగు రబియా కవితలు ఉన్నాయి. చదవడం మొదలుపెట్టాను. కిటికీలోంచి లోతైన నేల బావి మీదుగా ధారాళంగా సముద్రపుగాలి వీస్తోంది.

O my Lord, the stars glitter
and the eyes of men are closed.
Kings have locked their doors
and each lover is alone with his love.

Here, I am alone with you.


ఈ వాక్యాలు చదవగానే కొన్ని క్షణాలు కాలం ఆగిపోయింది. చిక్కాల కృష్ణారావు గారు మాట్లాడుతున్నారు. అతిధులు వింటున్నారు. గాలి వీస్తోంది. కాని కాలాతీతమైనది నా హృదయాన్ని స్పర్శించింది. కొంతసేపటి తరువాత అ స్థితి నుండి బయటకు వచ్చాకా కృష్ణారావుగారిని అడిగాను, రబియా ఎవరని. 

ఆయన రబియా గురించి, Sufism గురించి చెప్పడం మొదలుపెట్టారు. కాని అప్పటికే Sufism నా హృదయంలో బలంగా స్థితమైవుంది. కేవలం దాని పేరు, నిర్వచనం తెలియదంతే. ఆ తరవాత Charles Upton Translate చేసిన Doorkeeper of the Heart: Versions of Rabia, Coleman Barks Sufism మీద రాసిన గ్రంథాలతో నా పరిశోధన మొదలయింది. తరువాత ఎన్నో వందల సూఫీ గ్రంథాలు సేకరించాను. ఒక్కమాటలో చెప్పమంటే Sufism అనేది సాయంకాలపు గాలిలా చల్లనిది, ప్రేమభరితమైనది అని చెబుతాను.



No comments:

Post a Comment